: బహుళజాతి సంస్థల చైనా శాఖల అధిపతులుగా భారతీయులు!


బహుళ జాతి కార్పోరేట్ దిగ్గజాలు తమ చైనా శాఖల అధిపతులుగా భారతీయులకే ప్రథమ ప్రాధాన్యమిస్తున్నాయి. ఎందుకంటే, సంస్థ అధిపతులుగా భారతీయుల పనితీరు మిగిలిన వారికంటే మెరుగ్గా ఉంటోంది. ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా ఉన్న చైనాలో ఆ తరహా వ్యక్తులు లేరా? అన్న ప్రశ్నకు ఆయా కార్పోరేట్లు ఇస్తున్న సమాధానం మరింత ఆసక్తి కలిగించేలా ఉంది. చైనా దేశస్తులకు చెప్పిన పనిని చేసుకుపోవడం మాత్రమే తెలుసట. అదే, భారతీయులైతే, కంపెనీ నిర్దేశించిన దాని కన్నా మెరుగ్గా పనిచేస్తారట. అంతేకాదండోయ్, కీలక సందర్భాల్లో భారతీయులు తీసుకునే సాహసోపేత నిర్ణయాలతో వారు పనిచేసే సంస్థలు మరింత మెరుగైన స్థానంలో కూర్చుంటున్నాయని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ కారణంగానే పెప్సీకో, వర్ల్ పూల్ తరహా దిగ్గజ కంపెనీలు, చైనాలోని తమ శాఖలకు భారతీయులనే బాసులుగా నియమించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. పెప్సీకోకు సంబంధించి భారత్ లో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పవన్ భాటియాను 2011లో ఆ సంస్థ తన చైనా శాఖకు బదిలీ చేసింది. తాజాగా జార్జి కొవూర్ ను కూడా పెప్సీకో, చైనాకు బదిలీ చేసింది. వర్ల్ పూల్ కూడా ఈ దిశగా యోచిస్తోంది. తన చైనా శాఖలకు నేతృత్వం వహించేందుకు సరైన భారతీయుడిని వెతికిపెట్టమని కన్సల్టింగ్ సంస్థల చుట్టూ తిరుగుతోందని సమాచారం.

  • Loading...

More Telugu News