: డీడీలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం!


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగం తొలిసారిగా భారత ప్రభుత్వ అధికారిక ఛానెల్ దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 1925లో విజయదశమి సందర్భంగా పురుడుపోసుకున్న ఆరెస్సెస్, ఈ ఏడాదితో 90 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ నాగ్ పూర్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేయనున్నారు. దానిని దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ప్రైవేట్ కార్యక్రమాల్లో మాత్రం మోహన్ భగవత్ ప్రసంగమే మొదటి కార్యక్రమం. ఈ విషయాన్ని అటు డీడీతో పాటు ఆరెస్సెస్ వర్గాలు కూడా ధృవీకరించాయి. మోహన్ భగవత్ శుక్రవారం చేయనున్న ప్రసంగాన్ని ఆరెస్సెస్ కేడర్ తమకు మార్గదర్శిగానే పరిగణిస్తున్నారు. అయితే డీడీలో ఆయన ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం వివాదాస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ హయాంలో కూడా చోటుచేసుకోని తరహాలో ప్రస్తుతం ఆరెస్సెస్ కార్యక్రమాలను డీడీ ప్రత్యక్ష ప్రసారం చేయనుండటంపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News