: ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన 'స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులంతా ఆఫీసును శుభ్రం చేయడం ప్రారంభించారు. ఇంతలో ఎల్ బ్లాక్ లోని ఏడవ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిని గమనించిన సచివాలయ సిబ్బంది సత్వరమే స్పందించి మంటలను ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని సచివాలయ సిబ్బంది తెలిపారు.