: 16 ఏళ్ల తరువాత భారత హాకీ జట్టు అద్భుతం చేసింది
భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్ పై 4-2 తేడాతో విజయం సాధించి స్వర్ణపతకం గెలుచుకుంది. దీంతో 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత అసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు, భారత్ ఖాతాలో 9వ స్వర్ణపతకాన్ని జత చేసింది. ఈ విజయంతో 2016లో జరగనున్న రియో ఒలింపిక్స్ కి భారత హాకీ జట్టు అర్హత సాధించింది. హాకీ జట్టు విజయం పట్ల భారత క్రీడా ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది.