: ఏషియన్ సినిమాస్ ప్రారంభించిన రామ్ చరణ్, సమంత


టాలీవుడ్ యువనటుడు రామ్ చరణ్ తేజ్, నటి సమంత ఏషియన్ సినిమాస్ థియేటర్ను ప్రారంభించారు. హైదరాబాదులోని అత్తాపూర్ లో ఏషియన్‌ సినిమాస్‌ అధినేతలతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. హైదరాబాద్ లో ఐమాక్స్, ఐనాక్స్ సినిమా హాళ్లకు లభిస్తున్న ఆదరణతో ఏషియన్ సినిమాస్ హైదరాబాదులో తమ శాఖలను విస్తరించింది. నగర శివారు ప్రాంతమైన అత్తాపూర్ లో ఏషియన్ సినిమాస్ ఏర్పాటు చేయడం ద్వారా సగటు ప్రేక్షకులు సౌకర్యవంతమైన వినోదాన్ని ఆస్వాదిస్తారని యాజమాన్యం ఆశిస్తోంది. సినిమా థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా హీరో రాంచరణ్, సమంత, నిర్మాత డి సురేష్ బాబు తదితరులు కొద్దిసేపు సినిమాను తిలకించారు.

  • Loading...

More Telugu News