: అవకాశమిస్తే, 'స్వచ్ఛ భారత్' కు ప్రచారం చేస్తా: అమీర్ ఖాన్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్' అద్భుతమైన కార్యక్రమం అని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ప్రశంసించాడు. ఈ కార్యక్రమం తనకెంతగానో నచ్చిందని, అవకాశమిస్తే ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపాడు. పరిసరాలు శుభ్రంగా ఉంటే సగానికి పైగా సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, నీటి వనరులు పరిశుభ్రంగా ఉంటాయని అమీర్ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమాన్ని భారతీయులందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ముంబైలో ఉంటే తన ఇంటిని తాను స్వయంగా క్లీన్ చేసుకుంటానని అమీర్ వెల్లడించాడు. వ్యర్థ పదార్థాలు తన కార్యాలయాల్లో అసలు కనపడవని తెలిపాడు. గాంధీజీ 150వ జయంతిలోగా భారత్ ను 'స్వచ్ఛ భారత్' చేయాలని అందరూ కంకణం కట్టుకోవాలని అమీర్ సూచించాడు.