: బెంగళూరు హై అలర్ట్.. రంగంలోకి హోంశాఖ
బెంగళూరులో జరిగిన బాంబు పేలుడు వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయంలో అప్పుడే ఒక అంచనాకు రావడం కష్టమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్పీ సింగ్ అన్నారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడామని, విచారణకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ పేలుళ్ల అనుపానులు వెలికితీయాలని ఎన్ఐఎకు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. పేలుళ్ల నేపథ్యంలో నగరమంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.