: విజయవాడలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు
విజయవాడలో జరిగిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రకాష్ నగర్ నుంచి డాబుకొట్లు వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేశారు. ప్రకాష్ నగర్ లో చంద్రబాబు రోడ్లను ఊడ్చి 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ఏపీలో చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు.