: మహాత్ముడికి మోడీ ఘన నివాళి
భారత జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని బాపూ ఘాట్ లో ప్రధాని మోడీ, మహాత్ముడికి నివాళులర్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సో్నియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు కూడా గాంధీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ప్రధాని మోడీ రాకకు ముందే, సోనియా, మన్మోహన్ లు బాపూ ఘాట్ కు చేరుకుని మహాత్ముడికి నివాళి అర్పించారు. ఉదయం 7.30 గంటల సమయంలో బాపూ ఘాట్ చేరుకున్న మోడీ, మహాత్ముడికి నివాళుర్పించిన అనంతరం అక్కడే కొద్దిసేపు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సమీపంగా కూర్చున్నారు.