: రాజ్ నాథ్ సింగ్ బీజేపీ చీఫ్ అయితే పరిస్థితి ఇంకోలా ఉండేది: ఉద్థవ్ ఠాక్రే
బీజేపీ అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. గతంలోనే తాను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయేంత వరకు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాలని రాజ్నాథ్ సింగ్ కు సూచించానని ఆయన తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఎన్డీయే కూటమి నుంచి తాము బయటకు వచ్చేవాళ్లము కాదని ఆయన చెప్పారు. పార్టీ అథ్యక్షుడిగా రాజ్నాథ్ ఉన్నట్టయితే బీజేపీ, శివసేన మధ్య పొత్తు కొనసాగేదని ఆయన పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు గురించి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్నాథ్, సుష్మాతో చర్చించానని ఆయన వెల్లడించారు. దీంతో శివసేన, బీజేపీ మధ్య పొత్తు చెడిపోవడానికి కారణం బీజేపీ చీఫ్ అమిత్ షా అని ఆయన చెప్పకనే చెప్పారు.