: ఆ ఆరుగురు ఐఏఎస్ ల ప్రమోషన్లు చెల్లవు: క్యాట్


అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో పదోన్నతి పొందిన ఆరుగురు ఐఏఎస్ అధికారుల పదోన్నతిని క్యాట్ కొట్టివేసింది. ఆర్వీందర్ సింగ్, మల్లెల ప్రశాంతి, పి.కోటేశ్వరరావు, ఎన్.సత్యనారాయణ, సి.శ్రీధర్, మహ్మద్ ఇంతియాజ్ ల పదోన్నతులు చెల్లవని తీర్పు వెలువరించింది. పదోన్నతుల అంశంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి సరిగా లేదని క్యాట్ అభిప్రాయపడింది. మరోసారి పదోన్నతుల ప్రక్రియ చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేయాలని క్యాట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News