: సినీ నటి శ్రీలక్ష్మి మెడలో గొలుసు లేపేశారు
సినీ నటి శ్రీలక్ష్మి మెడలోని 8 తులాల బంగారు గొలుసును దుండగులు చోరీ చేశారు. యూసుఫ్ గూడలో నివాసముంటున్న శ్రీలక్ష్మి స్థానిక బేకరీకి వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో గొలుసు లాక్కుని పారిపోయారు. దీంతో ఆమె ఎస్ఆర్ నగర్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. సినీ నటి శ్రీలక్ష్మి హాస్య నటిగా తెలుగు ప్రజలకు సుపరిచితురాలు.