: కళ్లు పోతాయ్... జాగ్రత్త!
వయాగ్రా... సరసులను ఆనందడోలికల్లో ముంచెత్తిన ఔషధం. శృంగారంలో సమస్యలతో ఇబ్బంది పడేవారికి అద్భుతమైన పరిష్కారంగా వచ్చిన మందు వయాగ్రా. దీని సామర్థ్యంపై, దీని వాడకం వల్ల వచ్చే అనర్థాలపై పలు పరిశోధనలు జరిగాయి. వయాగ్రా వాడకంపై పరిశోధనా సంస్థలు పలు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వయాగ్రా వాడితే కంటి చూపు దెబ్బతింటుందని తాజాగా పరిశోధకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అందరికీ కంటి చూపు దెబ్బతినే అవకాశం లేదని, ఒక రకమైన మ్యూటేషన్ ఉన్నవారికి, రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమ్ ను సిల్డెనాఫిల్ అడ్డుకుంటుందని పరిశోధకులు తెలిపారు. వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో ఉపయోగించే వారికి కంటిపరమైన సమస్యలు రావచ్చన్న విషయం గతంలో కూడా నిర్ధారణ అయిందని పరిశోధకులు వెల్లడించారు. వయాగ్రా ఉపయోగించే వారికి... ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడడం లాంటి సమస్యలు రావచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.