: ఆసియా క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టుకు కాంస్యం
దక్షిణకొరియాలోని ఇంచియాన్ నగరం వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. బలమైన జపాన్ జట్టును 2-1తో చిత్తు చేసి కాంస్యం సాధించింది. భారత్ తరపున జస్ప్రీత్ కౌర్, వందన కటారియా గోల్స్ నమోదు చేయగా, జపాన్ తరపున అకానే షిబాతా గోల్ చేసింది. కాగా, ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. ఆసియాడ్ చరిత్రలో భారత మహిళల జట్టుకు ఇది మూడో కాంస్య పతకం. కాగా, తాజా ప్రదర్శనతో భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. నాలుగేళ్ళ కిందట చైనాలోని గ్వాంగ్ఝౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 0-1తో ఓటమిపాలైంది.