: తెలంగాణలో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకు ఉపకార వేతనాలు
ఈరోజు జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపకార వేతనాల చెల్లింపు వల్ల ప్రభుత్వంపై రూ.112 కోట్ల అదనపు భారం పడనుంది. అటు, రైతు రుణమాఫీ పథకం కింద 20 శాతం నిధుల విడుదలకు మంత్రివర్గం అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం 5.99 శాతం పెంచేందుకు కూడా సమ్మతి తెలిపింది. ట్యాంక్ బండ్ పై ఆంధ్ర ప్రముఖుల విగ్రహాల తొలగింపు అంశంపైనా మంత్రివర్గం చర్చించింది. విగ్రహాలు తెలుగుజాతి ఔన్నత్యానికి పాటుపడిన వారివిగా భావించాలని, విగ్రహాలకు ప్రాంతీయవాదం పులిమి, వాటిని తొలగించడం సరికాదని కేబినెట్ అభిప్రాయపడింది.