: పుట్టినరోజు నాడు రణబీర్ కపూర్ కు మైనర్ అపరేషన్
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కు మూడు రోజుల కిందట ముంబయిలో చిన్న ఆపరేషన్ జరిగింది. ఈ ఉదయమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. మరో విషయమేంటంటే, అదే రోజున అంటే సెప్టెంబర్ 28న అతడి పుట్టినరోజు. సంతోషంగా సెలబ్రేషన్స్ జరుపుకోవాల్సిన ఈ హీరో కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అడెనాయిడ్ టాన్సిల్స్ కు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఐఏఎన్ఎస్ వార్తా కథనం ప్రకారం, "రణబీర్ ఆసుపత్రిలో చేరాడు. ఈ ఉదయమే డిశ్చార్జ్ అయ్యాడు. కేవలం ఇది చిన్న ఆపరేషన్ మాత్రమే. ఎలాంటి ప్రమాదం లేదు" అని అధికారికంగా తెలిపారు.