: మాఫియా డాన్ తో వేదిక పంచుకున్న బీజేపీ చీఫ్ అమిత్ షా!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం హర్యానాలో మాఫియా డాన్ తో వేదికను పంచుకుని కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. నితిశ్ కటారా, జెస్సికా లాల్ హత్య కేసులో నిందితుడిగా తేలిన వికాస్ యాదవ్ తండ్రి, మాఫియా డాన్ డీపీ యాదవ్ తో కలిసి హర్యానాలో ఓ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీపీ యాదవ్ కు ముందు ముందు మంచి రోజులున్నాయని పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై నితిశ్ కటారా తల్లి నీలం కటారా ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. ‘డీపీ యాదవ్ కు మంచి రోజులుంటే, మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆమె అమిత్ షాను నిలదీశారు. 2004లోనూ డీపీ యాదవ్ కు బీజేపీ సభ్యత్వమిచ్చింది. అయితే, నితిశ్ కటారా హత్యోదంతం నేపథ్యంలో ఆరోపణల వెల్లువ కారణంగా నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది.