: ఏపీలో వీజీటీఎం, ఉడా పరిధిలోని పంచాయతీల అధికారాలు రద్దు


ఆంధ్రప్రదేశ్ లోని వీజీటీఎం, ఉడా పరిధిలోని పంచాయతీలకు అధికారాలు రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 201ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.సాంబశివరావు జారీ చేశారు. ఈ క్రమంలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పరిధిలోని పంచాయతీల అధికారాలు రద్దవుతాయి. తక్షణమే ఈ ప్రాంతాల్లో అధికారాల రద్దు అమల్లోకి వస్తుంది. కొత్త రాజధాని నిర్మాణ అవసరాల దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే పంచాయతీల అధికారాలు రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అటు దీనికి సంబంధించిన గెజిట్ ను అక్టోబర్ 7న ప్రభుత్వం విడుదల చేయనుంది. కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది.

  • Loading...

More Telugu News