: ఐసీసీపై ధ్వజమెత్తిన వకార్ యూనిస్


పాకిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్ వకార్ యూనిస్ ఐసీసీ వైఖరిపై మండిపడుతున్నాడు. ఇటీవలే స్పిన్నర్ సయీద్ అజ్మల్ పై సస్పెన్షన్ వేటు వేసిన ఐసీసీ, తాజాగా ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ బౌలింగ్ శైలిపైనా అనుమానాలు వ్యక్తం చేయడం దారుణమని వకార్ అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్ మరికొన్ని నెలలు ఉందనగా ఇలాంటి చర్యలు తీసుకోవడం ఐసీసీకి తగదన్నాడు. "నియమాలు, నిబంధనలు అమలు చేయాడానికి ఇది సరైన సమయమా?" అంటూ ప్రశ్నించాడు. వరల్డ్ కప్ కోసం జట్లన్నీ ప్రణాళికలు రచించుకుంటాయని, టోర్నీ ముందర సస్పెన్షన్ నిర్ణయాలు జట్టు వ్యూహాలను దెబ్బతీస్తాయని ఈ పేస్ దిగ్గజం అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదని అన్నాడు. ఓ స్పిన్నర్ దూస్రా ప్రయోగించాలంటే, అతను తన మోచేతిని మరింతగా వంచాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ అంశంపై తగిన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వకార్ సూచించాడు.

  • Loading...

More Telugu News