: దేశంలో ఒంటరి వృద్ధులు కోటిన్నర మంది!


భారత్... అభివృద్ధిలో వేగంగా దూసుకెళుతున్న దేశం. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు నానాటికీ మెరుగవుతున్నాయి. అయితే, వయసు మీద పడేదాకా అష్టకష్టాలకోర్చి పిల్లలను ప్రయోజకులను చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుందామనుకుంటున్న వృద్ధుల కల మాత్రం నెరవేరడం లేదు. 2011 జనాభా లెక్కలు సేకరించే నాటికే దేశవ్యాప్తంగా కోటిన్నర మంది దాకా వృద్ధులు ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రయోజకులైన పిల్లల ఆదరణకు నోచుకోకపోవడమో, లేక, పిల్లలు విదేశాల్లో సుదూరాన ఉండటమో ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఇక రాష్ట్రం విషయానికొస్తే, తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కలిపి 8.7 శాతం మంది వృద్ధులు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారట. ఈ విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ప్రాంతీయతకు, ప్రాంతీయ భాష పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వారు తమ తల్లిదండ్రుల సంరక్షణకు ఇవ్వడం లేదు. ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న వృద్ధుల్లో నాలుగింట మూడొంతుల మంది మహిళలేనట!

  • Loading...

More Telugu News