: బాంబు పేలుడు వల్లే ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
బెంగళూరులో జరిగిన పేలుడు బాంబు పేలుడుగానే పోలీసులు నిర్ధారించారు. మోటార్ సైకిల్ లో అమర్చిన ఐఇడి బాంబు పేలినట్లుగా తెలిపారు. దీనికి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? లేదా? అన్నదానిపై విచారణ జరుగుతోందని కర్ణాటక డీజీపీ వెల్లడించారు. బాంబు పేలుడు ధాటికి వాహనాలు దగ్ధం కావడంతో పాటు సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.