: మైక్రోసాఫ్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10’ ఆవిష్కరణ!


సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, తన కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్-10ను విడుదల చేసింది. విండోస్ 8తో పలు సమస్యలు ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్, తన ఆపరేటింగ్ సిస్టంల వరుస సంఖ్యలో తొలిసారి ఓ అంకెను(9) వదిలేసి విండోస్ 10 పేరిట కొత్త వెర్షన్ ను ఆవిష్కరించింది. తాము ఇప్పటిదాకా ఆవిష్కరించిన అన్ని ఆపరేటింగ్ సిస్టంలలోకి విండోస్ 10 అత్యంత విలువైనదని కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ టెర్రీ మెయిర్సన్ చెప్పారు. మొబైల్ తరహా ఆపరేటింగ్ సిస్టంతో కూడిన విండోస్ 10, కంపెనీకి మంచి పేరు తేనుందని ఆయన వెల్లడించారు. రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్ 8కు కేవలం 20 శాతం మంది మాత్రమే మారారు. దీంతో డీలాపడ్డ మైక్రోసాఫ్ట్, సుదీర్ఘ పరిశోధన అనంతరం విండోస్ 10 ను ఆవిష్కరించింది. మరి ఈ కొత్త వెర్షన్, మైక్రోసాఫ్ట్ కు ఏ మేరకు కీర్తిని గడించి పెడుతుందో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News