: పెట్రోల్ ధరలు తగ్గాయోచ్!


వాహనదారులకు శుభవార్త! పెట్రోల్ ధరలను తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. లీటర్ కు 65 పైసలు తగ్గిస్తున్నట్టు తెలిపాయి. తగ్గింపు నిర్ణయం ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. అటు, రాయితీలేని వంటగ్యాస్ ధరలు కూడా తగ్గించారు. సిలిండర్ పై రూ.21 తగ్గించారు. జులై తర్వాత రాయితీలేని వంటగ్యాస్ ధరలు తగ్గించడం ఇదే ప్రథమం. విమాన ఇంధన ధరను చమురు సంస్థలు 3 శాతం తగ్గించాయి. ఇక, డీజిల్ ధరలపై నిర్ణయాన్ని ప్రధాని మోడీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News