: నటి శ్వేతాబసు ఆరు నెలలు రెస్క్యూ హోంలో ఉండాల్సిందే: కోర్టు


దాదాపు నెలన్నర కిందట వ్యభిచారం కేసులో అరెస్టయిన నటి శ్వేతాబసు ప్రసాద్ ను విడుదల చేసేందుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు తిరస్కరించింది. ఆరు నెలల పాటు ఆమె రెస్క్యూ హోంలో ఉండాల్సిందేనని ఆదేశించింది. ఈ మేరకు, తన కుమార్తెను రిలీజ్ చేయాలంటూ శ్వేతాబసు తల్లి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అయితే, అక్కడే ఉంటే తన కూతురు సినీ కెరీర్ పాడవుతుందని తల్లి ఆవేదన చెందుతోంది. ప్రస్తుతం శ్వేత హైదరాబాదులోని ఓ రెస్క్యూ హోంలో ఉంది.

  • Loading...

More Telugu News