: జన్మభూమి పర్యవేక్షకులుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను నియమించిన చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జన్మభూమి, మనవూరు కార్యక్రమానికి ఇన్ ఛార్జుల నియామకం పూర్తయింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 26 మంది ఐఏఎస్, ఐపీఎస్, 13 మంది ఐఎఫ్ఎస్ అధికారులు జన్మభూమి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఒక్కో రెవెన్యూ డివిజన్ ను ఒక్కో అధికారి పర్యవేక్షిస్తారు. అక్టోబర్ 2 నుంచి 20 వరకు గ్రామాలలో జరిగే అన్ని కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం పరిశీలిస్తుంది.