: నిర్మాత బండ్ల గణేష్ పై ఫిర్యాదు
సినీ నిర్మాత బండ్ల గణేష్ పై హైదరాబాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ ఫైనాన్షియర్ ఫిర్యాదు చేశారు. గణేష్ నిర్మించిన 'గబ్బర్ సింగ్' చిత్ర ప్రదర్శన ప్రాంత హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్షియర్ ధర్మచరణ్ తులసి 2011లో రూ.80 లక్షల ఇచ్చాడని పోలీసులకు తెలిపాడు. అందుకు అగ్రిమెంట్ చేసుకున్నామని, తర్వాత తనను కాదని గణేష్ వేరేవారికి ఆ చిత్ర ప్రదర్శన హక్కుల్కి అమ్మినట్లు చెప్పాడు. అయినా తనకు రావల్సిన డబ్బును నిర్మాత గణేష్ ఇంకా ఇవ్వలేదని బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులో వివరించాడు.