: విచ్ఛిన్నానికి రాహుల్, చవాన్ లే కారణం: శరద్ పవార్


కాంగ్రెస్ తో తమ 15 ఏళ్ల బంధం ముగియడానికి కారణాలేమిటో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మహారాష్ట్ర తాజా మాజీ సీఎం ఫృథ్వీరాజ్ చవాన్ లే అందుకు కారణమని ఆయన సోమవారం తేల్చిచెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ ప్రమేయం ఏమీ లేదని కూడా పవార్ వ్యాఖ్యానించారు. మిత్ర పక్షాలను చిన్న చూపు చూసిన రాహుల్, చవాన్ లు పదిహేనేళ్ల నాటి స్నేహానికి చరమ గీతం పాడారని ఆ వృద్ధ నేత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నుంచే వచ్చిన తనకు, ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ముందే తెలుసని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎన్సీపీ తమను అపార్థం చేసుకుందని చవాన్ ఆరోపించారు. విలాస్ రావ్ దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్ లతో మాకెలాంటి సమస్యలు రాలేదే?’’అంటూ శరద్ పవార్ విరుచుకుపడ్డారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ నేత చేతిలో పరాజయం పాలైన చవాన్, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్న రీతిలో వ్యవహరించారని పవార్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News