: అంగారకుడిపై 'ధూళి తుపాను'... ఫొటో పంపిన మామ్
అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన మామ్ సమర్థవంతంగా పనిచేస్తోంది. అరుణుడిపై పరిస్థితిని ఫొటోల రూపంలో భూమికి పంపిస్తోంది. తాజాగా అక్కడ చెలరేగిన దుమ్ము, ధూళితో కూడిన తుపానుకు సంబంధించిన ఫొటోను పంపింది. అరుణుడి ఉత్తరార్ధ గోళంలో ఈ తుపాను ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం అంగారకుడిపై మీథేన్ జాడలను, ఖనిజాల లభ్యతను మామ్ వెతికే ప్రయత్నం చేస్తోంది. జీవనానికి ఆధారం మీథేన్ వాయువు అన్న సంగతి తెలిసిందే.