ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈ ఉదయం 6.40 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో, భయకంపితులైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరగబోతుందా అని తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.