: నేడు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు ఆయన హాజరవుతున్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని కృష్ణారావు తెలిపారు.