: మూడేళ్లలో నాలెడ్జి సిటీగా ఏపీ: చంద్రబాబు


రానున్న మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జి సిటీగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోమవారం విశాఖలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలోని కంపెనీల అధిపతులతో నిర్వహించిన భేటీలో పలు అంశాలపై చంద్రబాబు ప్రకటన చేశారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రాన్ని డిజిటల్ ఏపీగా తీర్చిదిద్దడంతో పాటు రెండేళ్లోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అక్షరాస్యుడు, ఓ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఉండాలనేదే డిజిటల్ ఏపీ లక్ష్యమన్నారు. ఇక రెండేళ్లలోని ఇంటింటికీ అందించనున్న ఇంటర్నెట్ ను సాదాసీదాగా కాకుండా హైబ్యాండ్ విడ్త్ తో అందించనున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టులు డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాల మాదిరే మేడిన్ ఏపీ, డిజిటల్ ఏపీ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు కంప్యూటర్లను అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచేందుకు గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News