: ఉగ్రవాదుల్లో మంచివాడు, చెడ్డవాడు అంటూ ఉండరు: మోడీ


ఉగ్రవాదంలో మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదమంటూ ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇచ్చిన విందు అనంతరం ఉగ్రవాదంపై మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ఉగ్రవాదుల్లో మంచి వాడు, చెడు ఉగ్రవాది అంటూ ఉండరని, ఉగ్రవాదులంటేనే విచ్ఛిన్నకారులని మోడీ అన్నారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైన్యాలను ఉపసంహరించుకోవడాన్ని మోడీ తప్పుబట్టారు. అఫ్ఘాన్ నుంచి అమెరికా సైనిక ఉపసంహరణ దశలవారీగా జరగాల్సి ఉందన్నారు. శరవేగంగా అమెరికా సైనికులు అక్కడి నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో తాలిబన్లకు సురక్షిత క్షేత్రంగా అఫ్ఘాన్ మారిపోయిందన్నారు. అధ్యక్ష ఎన్నికలు ముగిసిన అఫ్ఘాన్ లో ప్రజా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఏర్పడిందని, ఆ ప్రభుత్వం ప్రజాసామ్యబద్ధంగా మరింత బలోపేతం కావాల్సి ఉందని అన్నారు. తాలిబన్లను తుదముట్టించేందుకు అమెరికాతో కలిసి భారత్, అఫ్ఘాన్ లో కీలక చర్యలు చేపట్టనుందని ఈ సందర్భంగా మోడీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News