: ఆసియా క్రీడల్లో భారత్ కు 6వ స్వర్ణం
దక్షిణ కొరియాలో ఇంచియాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు ఆరో పసిడి పతకం లభించింది. టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా, సాకేత్ మైనేని జోడీ 6-4, 6-3తో చైనీస్ తైపీ జంట యిన్ పెంగ్, చాన్ పై నెగ్గింది. సానియా, సాకేత్ ధాటికి ప్రత్యర్థులు ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో, భారత జోడీ వరుస సెట్లలో అలవోకగా విజయం సాధించింది.