: భగత్ సింగ్ సోదరి కన్నుమూత
దేశం కోసం ఉరికంబం ఎక్కిన యోధుడు భగత్ సింగ్ సోదరి ప్రకాశ్ కౌర్ కెనడాలో కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. ప్రకాశ్ కౌర్ ఆదివారం నాడు తుది శ్వాస విడిచారని పంజాబ్ లోని హోషియార్పూర్లో ఉండే ఆమె అల్లుడు హర్భజన్ సింగ్ ధాట్ తెలిపారు. 1928లో లాహోర్లో ఓ బ్రిటీష్ పోలీసు అధికారిని చంపాడన్న కారణంగా భగత్ సింగ్ ను 1931 మార్చి 24న ఉరితీశారు.