: 'అమ్మ' లేక అనాథలయ్యారు!


తమిళనాడులో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానుల ప్రస్తుత పరిస్థితి ఇది! అధినేత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలవడంతో ఇప్పుడు వారు 'అమ్మ'ను కోల్పోయిన పసిబిడ్డల్లా విలపిస్తున్నారు. అభిమానుల సంగతి సరేసరి. ప్రాణాలు వదిలేందుకు కూడా వారు వెనుకాడడంలేదు. తాజాగా, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో, అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కన్నీటి పర్యంతమయ్యారు. జయలలితకు వీర విధేయులుగా పేరుగాంచిన ఈ నేతలు (పన్నీర్ సెల్వం సహా) ఒక్కసారిగా కళ్ళ నీళ్ళు పెట్టుకోవడంతో అక్కడ విషాదం నెలకొంది. వైద్యలింగం, వలార్ మత్తి, తంగమణి వంటి పార్టీ సీనియర్లు సైతం విలపించారు. కాగా, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేయగా... జయ క్యాబినెట్లోని మంత్రులే కొత్తగా ప్రమాణం చేశారు.

  • Loading...

More Telugu News