: ఏపీ విజిలెన్స్ కమిషనర్ గా ఎస్వీ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషనర్ గా ఎస్వీ ప్రసాద్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి కమిషనర్ గా కొనసాగనున్న ఆయన, మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. కాగా, 2011లో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి విజిలెన్స్ కమిషనర్ గా నియమితులయ్యారు. ఇప్పటిదాకా అదే పదవిలో కొనసాగారు. తాజా నియామకంతో ఆయన ఇకపై ఏపీకి తన సేవలు అందించనున్నారు. ప్రసాద్ గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.