: విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ సంస్థలతో ఏపీ సర్కారు ఒప్పందాలు


విశాఖలోని నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఐటీ సీఈవోల సదస్సులో ఏపీ ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలక ఒప్పందాలు జరిగాయి. మధురవాడ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధికి అవగాహన ఒప్పందం, మధురవాడ ఐటీ సెంటర్ అభివృద్ధికి మాబ్ ఎంఈ, చిరువ్యాపారులు, మహిళలు ఇంటర్నెట్ ద్వారా లబ్ధి పొందేందుకు గూగుల్ ఇండియా సాయం... తదితర ఒప్పందాలు ఈ సమావేశంలో జరిగాయి. మొత్తం 400 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు బాలకృష్ణన్ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News