: రెండు రోజుల్లో 300 ర్యాలీలు: మహారాష్ట్రలో బీజేపీ ఎత్తుగడ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించడం కోసం బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. శివసేనతో స్నేహ బంధం తెగిపోయిన నేపథ్యంలో, మరింత పకడ్బంధీగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లో 300 ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మంగళ, బుధ వారాల్లో రాష్ట్రంలోని 288 నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన ప్రధాన నాయకులు పర్యటించనున్నారు. వీరిలో ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, రాధా మోహన్ సింగ్, నవజ్యోత్ సంగ్ సిద్ధూ లాంటి నేతలు ఉన్నారు.