: తెలంగాణ రైతులకు కేసీఆర్ మూల్యం చెల్లించక తప్పదు: సీపీఐ
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యల కారణంగా రైతులు నష్టాల పాలవుతున్నారని ఆ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ మేరకు కరీంనగర్లో మాట్లాడిన ఆయన, గ్రామాల్లో భారీగా, నగరాల్లో నాలుగు నుంచి ఆరు గంటలు వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లలో జరుపుకునే పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ కేసీఆర్ ప్రజాధనాన్ని ఖర్చుపెడుతున్నారని విమర్శించారు.