: సబ్సిడీ సిలిండర్ల సంఖ్య మళ్లీ 9కి కుదింపు?: కేంద్రం యోచన


రాయితీ కింద ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను మళ్లీ 9 కి కుదించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ సబ్సిడీ దుర్వినియోగం, గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట వేయాలంటే, సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అనుకున్నదే తడవుగా దీనిపై పరిశీలన చేసి అభిప్రాయం చెప్పాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు దీనిపై లోతుగా పరిశీలన చేస్తున్నారు. అసలు సబ్సిడీ సిిలిండర్ల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనేగా మీ ప్రశ్న. ఇంటికి తొమ్మిది సబ్సిడీ సిలిండర్ల నిబంధనను సడలించి, 12 కు పెంచాలన్న నాటి యూపీఏ ప్రభుత్వం చర్యతో సిలిండర్ల వినియోగంలో ఒకేసారి 12 శాతం విక్రయాలు పెరిగాయట. దీంతో సబ్సిడీ అవసరం లేని బడాబాబులు కూడా సబ్సిడీ సిలిండర్లను యథేచ్ఛగా వాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో సబ్సిడీ దుర్వినియోగానికి చెక్ పెట్టాలంటే, సబ్సిడీలపై పరిమితి విధించాల్సిందేనని కేంద్రం యోచిస్తోంది. అంటే, సమీప భవిష్యత్తులోనే సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 9కి తగ్గిపోవడం ఖాయమేనన్నమాట.

  • Loading...

More Telugu News