: హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జయ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ప్రత్యేక న్యాయస్థానం తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని ఆమె కోరారు. దసరా సెలవుల కారణంగా కోర్టుకు సెలవులు ఉండటంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసును ప్రముఖ న్యాయవాది రాం జఠ్మలానీ వాదించనున్నారు.