: జమ్మూ కాశ్మీర్ లో నేడు, రేపు సోనియా, రాహుల్ పర్యటన


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. తీవ్ర వరదల కారణంగా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్న ఆ రాష్ట్రంలో నేడు, రేపు వారిద్దరూ పర్యటించనున్నారు. "సోనియా, రాహుల్ జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. ఎన్నడూ లేని వరదల కారణంగా ప్రజల ఆస్తులకు, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని అంచనా వేస్తారు" అని కాంగ్రెస్ సీనియర్ అధికారులు ఒకరు తెలిపారు. వారితో పాటు ఆ రాష్ట్ర పార్టీ నేత గులాం నబీ ఆజాద్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అంబికా సోనీ, పలువురు వారి వెంట ఉంటారు.

  • Loading...

More Telugu News