: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దత్తు బాధ్యతల స్వీకరణ


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హంద్యాళ లక్ష్మీనారాయణస్వామి దత్తు ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత 42వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన చేత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు. 14 నెలల పాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్ దత్తు, 2015, డిసెంబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. కర్ణాటకలోని బళ్లారి సమీప ప్రాంతం హంద్యాళకు చెందిన జస్టిస్ దత్తు, 1975లో బెంగళూరులో న్యాయవాద వృత్తి జీవితం ప్రారంభించారు. సివిల్, క్రిమినల్ కేసులన్న తేడా లేకుండా అన్ని రకాల కేసుల వాదనలో జస్టిస్ దత్తుది అందెవేసిన చేయి. ట్యాక్స్ సంబంధిత కేసుల్లో విశేష ప్రతిభ చాటిన జస్టిస్ దత్తు, సేల్స్ ట్యాక్స్, ఆదాయపన్నుశాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 1995లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్ దత్తు, చత్తీస్ గఢ్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News