: ఇన్నొవేటివ్ ఇండస్ట్రియల్ పాలసీ తెస్తున్నాం: సత్య నాదెళ్లతో కేసీఆర్


త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇన్నొవేటివ్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకువస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఐటీ రంగానికి పెద్దపీట వేస్తామని వెల్లడించారు. నిన్న సాయంత్రం కేసీఆర్ తో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. తెలంగాణలో ఐటీ రంగ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిపై వీరిరువురూ చర్చించుకున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే విషయంలో తమ ప్రభుత్వం ముందుంటుందని కేసీఆర్ తెలిపారు. అయితే, ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ ను సత్య నాదెళ్ల కేవలం మర్యాద పూర్వకంగానే కలిశారని అధికారులు చెబుతున్నారు. ఈ భేటీకి టీఎస్ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News