: జయకు జైలు... జీర్ణించుకోలేక 14 మంది మృతి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్షను జీర్ణించుకోలేని ఆమె అభిమానులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. జయకు జైలు శిక్ష పడటంతో ఆమె అభిమానుల్లో పలువురు గుండెపోటుకు గురయ్యారు. వీరిలో 14 మంది మరణించారు. మరోవైపు జయలలితకు జైలు శిక్ష తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోర్టు తీర్పును నిరసిస్తూ అన్నా డీఎంకే కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడుతున్నారు.