: కాసేపట్లో మాడిసన్ స్క్వేర్ లో ప్రసంగించనున్న మోడీ


భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో హల్ చల్ చేస్తున్నారు. కాసేపట్లో ఆయన న్యూయార్క్ లోని చారిత్రక మాడిసన్ స్క్వేర్ పార్క్ లో ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి 20 వేల మందికి పైగా ఎన్నారైలు తరలివస్తున్నారని అంచనా. ఈ రాత్రి 8.30 (భారత కాలమానం ప్రకారం) గంటల తర్వాత కార్యక్రమం ప్రారంభంకానుంది. 9.30 తర్వాత నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. నిన్న ఐక్యరాజ్య సమితిలో నరేంద్రమోడీ హిందీలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. దీంతో, మాడిసన్ స్క్వేర్ లో మోడీ ఏం మాట్లాడతారో అని భారతీయులతో పాటు అమెరికా ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి తెలుగు అమ్మాయి నీనా దావులూరి ప్రయోక్తగా వ్యవహరిస్తోంది.

  • Loading...

More Telugu News