: జగన్ జైలుకు పోక తప్పదు: చీఫ్ విప్ కాల్వ
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించేవారు ఎవరైనా సరే చట్టం ముందు తల వంచక తప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ కు... తన భవిష్యత్ ఏమిటో నిన్న జయలలితకు పడిన శిక్షతో అర్థమయి ఉంటుందని అన్నారు. జయపై కేవలం ఒక ఛార్జ్ షీట్ మాత్రమే దాఖలయిందని... జగన్ పై 11 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని... అన్నిట్లో జగన్ ఏ1గా ఉన్నారని గుర్తుచేశారు. ఒక ముఖ్యమంత్రి కుమారుడిపై 11 కేసులు నమోదవడం దేశ చరిత్రలోనే లేదని అన్నారు. ఇన్ని కేసుల్లో నిందితుడైన జగన్ తప్పించుకునే పరిస్థితే లేదని... జైలుకు పోక తప్పదని తెలిపారు.