: సార్క్ ను బలోపేతం చేద్దాం: మిత్ర దేశాలకు మోడీ పిలుపు


దక్షిణాసియా శిఖరాగ్ర కూటమి (సార్క్)ని మరింత బలోపేతం చేద్దామని భారత ప్రధాని నరేంద్ర మోడీ మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, బంగ్లాదేశ్, నేపాల్ ప్రధానులు షేక్ హసీనా, సుశీల్ కొయిరాలాలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సార్క్ పోషించాల్సిన కీలక భూమికను మోడీ వారికి వివరించారు. సభ్య దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలని మోడీ పిలుపునిచ్చారు. మోడీ ప్రతిపాదనకు మూడు దేశాల అధినేతలు సానుకూలంగా స్పందించారు. ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంపై వారు మోడీని అభినందనలతో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News