: బెంగళూరు పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్ఐఎ
బెంగళూరు నగరంలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) బృందం రంగంలోకి దిగింది. ఘటనా ప్రాంతాన్ని ఎన్ఐఎ పోలీసులు పరిశీలిస్తున్నారు. మోటార్ సైకిల్ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందని బెంగళూరు నగర పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి సంఖ్య పెరిగింది. 8 మంది పోలీసులు సహా 18 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.