: సుప్రీం కోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా హెచ్.ఎల్.దత్తు ప్రమాణస్వీకారం
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎల్.దత్తు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ ఆర్ఎమ్ లోథా స్థానంలో ఆయన చీఫ్ జస్టిస్ గా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఆయన పూర్తి పేరు హండ్యల లక్ష్మీనారాయణస్వామి దత్తు. ఈయన కేరళ, ఛత్తీస్ గఢ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. దత్తు సుప్రీం కోర్టు సీజేగా 14 నెలలపాటు వ్యవహరిస్తారు.